వంకలో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-05-31T04:20:35+05:30 IST

వృద్ధాప్యంలో తాను కుటుంబ సభ్యులకు భారం కాకూడదనుకున్న మీరాశి నారాయణమ్మ (72) అనే వృద్ధురాలు వంకలో పడి మృతి చెందింది

వంకలో పడి వృద్ధురాలి మృతి
నారాయణమ్మ మృతదేహం

చెన్నూరు, మే 30: వృద్ధాప్యంలో తాను కుటుంబ సభ్యులకు భారం కాకూడదనుకున్న  మీరాశి నారాయణమ్మ (72) అనే వృద్ధురాలు వంకలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రామనపల్లెకు చెందిన  నారాయణమ్మ కూతురు, కుమారుడు చనిపోయా రు. దీంతో ఆమెను ఆమె భర్త రోశయ్యను కోడలే చూసుకునేది. అయితే కూతురు, కొడుకు చనిపోవడం ఆమెను మానసికంగా కృంగతీయడంతో కోడలికి భారం కాకూడదని (22న గత శనివారం) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఎక్కడా కనిపించలేదు. ఆదివారం రామనపల్లె వంకలో వృద్ధురాలి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2021-05-31T04:20:35+05:30 IST