నీటికుంటలో దిగి వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2021-05-31T04:21:50+05:30 IST

మండల పరిధిలోని చిటూ ్లరు గ్రామం పాలన్నగారిపల్లెకు చెందిన బొగ్గు లక్ష్మయ్య (63) ఆదివారం నీటికుంటలో దిగి ప్రమాదశాత్తు మృతి చెందాడు.

నీటికుంటలో దిగి వృద్ధుడు మృతి
బొగ్గు లక్ష్మయ్య మృతదేహం

రామాపురం, మే 30: మండల పరిధిలోని చిటూ ్లరు గ్రామం పాలన్నగారిపల్లెకు చెందిన బొగ్గు లక్ష్మయ్య (63) ఆదివారం నీటికుంటలో దిగి ప్రమాదశాత్తు మృతి చెందాడు. పోలీసుల వివ రాల మేరకు... లక్ష్మయ్య బర్రెలను మేత మేపుకోవ డానికి తోలుకెళ్లాడు. అక్కడే ఉన్న నీటి కుంటలో బర్రెలు మునిగి ఎంతసేపటికి బయటికి రాలేదు. దీంతో వాటిని తోలేందుకు లక్ష్మయ్య బట్టలు, చెప్పులు గడ్డమీద వదిలి నీటి కుంటలో దిగాడు. శనివారం ఇంటికి రాకపోవడంతో ఆదివారం ఉద యం లక్ష్మయ్య బంధువులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. రామాపురం పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని నీటికుంటలో గాలించి పాచిలో ఇరుక్కుపోయి ఉన్న లక్ష్మయ్య మృతదేహాన్ని గుర్తించారు. బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాపురం ఎస్‌ఐ జయరాములు తెలిపారు.  

Updated Date - 2021-05-31T04:21:50+05:30 IST