సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

ABN , First Publish Date - 2021-12-20T04:56:02+05:30 IST

పులివెందులలో 23, 24వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎం పీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ

పులివెందుల టౌన్‌, డిసెంబరు 19: పులివెందులలో 23, 24వ తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఎం పీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం చేతులమీదుగా ప్రా రంభం కానున్న మా ర్కెట్‌ యార్డు, ఫిష్‌ హబ్‌, నూతన పోలీ్‌సస్టేషన్‌, జగనన్న హౌసింగ్‌ కాలనీ తదితర కార్యక్రమాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. సం బంధిత అధికారులతో ఏర్పాట్లపై చర్చించి సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐ భాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, ఎస్‌ఐ చిరంజీవి, ట్రాఫిక్‌ ఎస్‌ఐ హాజీవలి, ఏఎ్‌సఐ స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-20T04:56:02+05:30 IST