ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-21T04:48:25+05:30 IST

నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో రోజా టవర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ జహీర్‌ (51) అనే వ్యక్తి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
షేక్‌ జహీర్‌ మృతదేహం

జమ్మలమడుగు రూరల్‌, మే 20: నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో రోజా టవర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ జహీర్‌ (51) అనే వ్యక్తి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శనగల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు జరిగి అప్పులపాలైనట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా గత కొన్ని రోజుల నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు పది మందికిపైగా డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకోగా వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు రాత్రి 8.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, భార్య ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2021-05-21T04:48:25+05:30 IST