చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-15T05:29:48+05:30 IST

కడప నగరం మేకలదొడ్డి సమీపంలో బుధవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రగాయాలైన వ్యక్తి రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కడప అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కడప(క్రైం), అక్టోబరు 14: కడప నగరం మేకలదొడ్డి సమీపంలో బుధవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి తీవ్రగాయాలైన వ్యక్తి రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కడప అర్బన్‌ సీఐ మహమ్మద్‌ అలీ తెలిపారు. సీఐ వివరాల మేరకు మేకల దొడ్డి ప్రాంతానికి చెందిన కటిక ఖాజ (35) కుటుంబ సభ్యులతో రాత్రి ఇంట్లో ఉండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలి అతనికి, అతని తండ్రికి మంటలు వ్యాపించాయి. చికిత్స నిమిత్తం వారిని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఖాజ మృతిచెందారని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. 


మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు అందించాలి

కడప (మారుతీనగర్‌), అక్టోబరు 14: గ్యాస్‌పేలి మరణించిన బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించి ఆదుకోవాలని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు, సంఘసేవకుడు సయ్యద్‌ సలావుద్దీన్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం వారు గ్యాస్‌ పేలిన బాధిత గృహాన్ని పరిశీలించారు. పేలిన దుర్ఘటనలో ఖాజా అనే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైందని, మానవత్వంతో ఆదుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-15T05:29:48+05:30 IST