రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-22T04:58:46+05:30 IST

మండలంలోని సుగుమంచిపల్లె ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి పెద్దిరాజు (40) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

కొండాపురం, అక్టోబరు 21: మండలంలోని సుగుమంచిపల్లె ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి పెద్దిరాజు (40) అనే వ్యక్తి మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... పెద్దిరాజు మరో వ్యక్తి కలిసి మోటార్‌సైకిల్‌పై సుగుమంచిపల్లె నుంచి తాళ్లప్రొద్దుటూరుకు కూలి పని నిమిత్తం బయలుదేరాడు. అదే వైపు నుంచి వస్తున్న ఉల్లిగడ్డల లారీ ఢీకొనడంతో పెద్దిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్పగాయాలు కాగా అతడిని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా పెద్దిరాజుకు భార్యతో పాటు కుమార్తె, కుమారుడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ విద్యాసాగర్‌ తెలిపారు.

Updated Date - 2021-10-22T04:58:46+05:30 IST