ప్రసార మాధ్యమాలది కీలకపాత్ర : వీసీ

ABN , First Publish Date - 2021-10-22T05:06:20+05:30 IST

ఆధునిక, సాంకేతిక యుగంలో సమాచారం వ్యాప్తి చేయడంతో ప్రసార మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తాయని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూలో జర్నలిజం అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రసార మాధ్యమాల పాత్ర, భవిష్యత్తు సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై గురువారం జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించారు.

ప్రసార మాధ్యమాలది కీలకపాత్ర : వీసీ

కడప(వైవీయూ), అక్టోబరు 21: ఆధునిక, సాంకేతిక యుగంలో సమాచారం వ్యాప్తి చేయడంతో ప్రసార మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తాయని వీసీ సూర్యకళావతి అన్నారు. వైవీయూలో జర్నలిజం అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రసార మాధ్యమాల పాత్ర, భవిష్యత్తు సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై గురువారం జాతీయ వెబ్‌నార్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ సూర్యకళావతి హాజరై మాట్లాడుతూ ఇంటర్నెట్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ పెరగడం వలన ప్రసారాల్లో వేగం పెరిగిపోయిందన్నారు. రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న రంగం జర్నలిజమని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాధ్‌రెడి ్డ మాట్లాడుతూ పాత్రికేయులు భవిష్యత్తులో ఈ రంగంలోకి అడుగు పెడితే ప్రెస్‌ అకాడమీ పలు ప్రయోజనాలు చేపడుతుందన్నారు. ప్రిన్సిపాల్‌ చంద్రమతి శంకర్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ యజ్ఞశ్రీ మణికర్ణిక, తిరుపతి మహిళా యూనివర్శిటీ జర్నలిజం శాఖ అధ్యాపకురాలు త్రిపురసుందరి, డాక్టర్‌ సునీత, స్వప్న, రామసుధ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:06:20+05:30 IST