వైభవంగా షిర్డీ సాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-08-28T05:14:56+05:30 IST

మండల పరిధిలోని వత్తలూరు పంచాయతీ మల్లెంవారిపల్లెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం షిర్డీసాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది.

వైభవంగా షిర్డీ సాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ
విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో ఎమ్మెల్యేలు మేడా, కొరముట్ల

పుల్లంపేట, ఆగస్టు 27 : మండల పరిధిలోని వత్తలూరు పంచాయతీ మల్లెంవారిపల్లెలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం షిర్డీసాయినాధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ చేశా రు. వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి, ఆయన సతీమణి మాళవికలు కోటి రూపాయలు పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో నవగ్రహ ప్రతిష్ఠ, విగ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.

 

Updated Date - 2021-08-28T05:14:56+05:30 IST