సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్ర ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-22T05:07:25+05:30 IST

స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన సుభాష్‌ చంద్రబోష్‌ గొప్పతనాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి సూచించారు. కడప నగరం జయనగర్‌ జడ్పీ బాలకల ఉన్నత పాఠశాలలో జరిగిన ఆజాదీకా అమృత మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్ర ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 21: స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరైన సుభాష్‌ చంద్రబోష్‌ గొప్పతనాన్ని ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి డాక్టర్‌ అంబవరం ప్రభాకర్‌రెడ్డి సూచించారు. కడప నగరం జయనగర్‌ జడ్పీ బాలకల ఉన్నత పాఠశాలలో జరిగిన ఆజాదీకా అమృత మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యవతితో కలిసి సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే ప్రముఖుల జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. సమగ్రశిక్ష అకాడమీ మానిటరింగ్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి, అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ రామాంజనేయరెడ్డి, అసిస్టెంట్‌ ఆల్టర్నేటివ్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ దశరథరామిరెడ్డి, పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:07:25+05:30 IST