మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు
ABN , First Publish Date - 2021-03-29T05:07:34+05:30 IST
తెలుగు పదాలతో శివతాండవం ఆడించి, తెలుగు సాహితీకారుల్లో అగ్రగణ్యుడిగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు అని ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి కొనియాడారు.
కడప(క్రైం), మార్చి 28: తెలుగు పదాలతో శివతాండవం ఆడించి, తెలుగు సాహితీకారుల్లో అగ్రగణ్యుడిగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు అని ఏఆర్ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి కొనియాడారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆదివారం పుట్టపర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అనితర సాధ్యమైన కావ్యాన్ని రచించి సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధ్రువతారగా నిలిచారన్నారు. ఆయన మలయాళం, సంస్కృతం, ఆంగ్లంలో స్వతంత్ర రచనలు కూడా చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐలు శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, జార్జి, సోమశేకర్‌నాయక్, ఆర్‌ఎస్‌ఐలు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
శిష్యులపాలిట కల్పవృక్షం
కడప(మారుతీనగర్), మార్చి 28: శిష్యులను ఆదరించి అక్కున చేర్చుకున్న కల్పవృక్షం పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు అని కవయిత్రి మొల్ల సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు విద్వాన్ గానుగపెంట హనుమంతరావు కొనియాడారు. పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని పురష్కరించుకొని ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో మొల్ల సాహితీపీఠం ప్రధాన కార్యదర్శి జి.వి.మనోజ్‌కుమార్, సాహితీవేత్తలు వెంకటేశ్వరాచారి, రంగనాయకులు, గంగాధర్ పాల్గొన్నారు.
విలక్షణ ప్రతిభామూర్తి
14 భాషల్లో పాండిత్యం కలిగి కవిగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా వెలుగొందిన విలక్షణ ప్రతిభామూర్తి సరస్వతీపుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులని సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యుడు మూల మల్లికార్జునరెడ్డి కొనియాడారు. పుట్టపర్తి నారాయణాచార్యుల 107వ జయంతిని పురస్కరించుకొని వైవీయూ ఆధ్వర్యంలో సీపీబ్రౌన్ భాషాపరిశోధన కేంద్రంలో ఆదివారం జయంతి కార్యక్రమం నిర్వహించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆ కేంద్రం సహాయ పరిశోధకుడు భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంఽథపాలకుడు ఎన్.రమే్‌షరావు, విశ్రాంత తెలుగు పండితులు కె.రాజారెడ్డి, రచయిత ఆర్.ఎన్.ప్రతాపరెడ్డితో పాటుగా ఆ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.