ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-09T04:23:05+05:30 IST

రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు.

ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది : ఎమ్మెల్యే

చాపాడు, డిసెంబరు 8: రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసాల ద్వారా ఇప్పటికే వరి ధాన్యాన్ని కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. భారీ వర్షానికి దెబ్బతిన్న వరిపైరుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. పెన్నానది వరదతో కొట్టుకుపోయిన కరెంటు స్తంభాలకు బదులుగా రాజుపాళెం, వెదురూరు, తిప్పిరెడ్డిపలె ్ల గ్రామాల పరిధిలో కొత్తవి ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖ ఏఈ రవిశంకర్‌ను ఆదేశించారు.

పాఠశాలల్లో తరగతి గదులు తక్కువగా ఉన్నాయని చియ్యపాడు ఎంపీటీసీ బాలనరసింహారెడ్డి తెలిపారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు శారదమ్మ, నీరజ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్ర హించారు. మండలాధ్యక్షుడు పి.లక్షుమయ్య, తహసీల్దారు జ్యోతి రత్నకుమారి, ఎంపీడీఓ శ్రీధర్‌నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

సీఎం జగన్‌ మహిళా పక్షపాతి

 ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. వైఎస్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మండలంలోని మొత్తం 762 డ్వాక్రా మహిళా సంఘాలకు రెండో విడత కూడా రూ.5,35,80,000లు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు.

Updated Date - 2021-12-09T04:23:05+05:30 IST