అన్నదాతలకు ప్రభుత్వం ఆపన్నహస్తం

ABN , First Publish Date - 2021-11-24T05:09:00+05:30 IST

గత కొన్ని రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నదాతలకు భరోసా ఇచ్చారు. జవాద్‌ తుఫాను కారణంగా పెన్నానది పరివాహక ప్రాంతమైన పాతకడప, వాటర్‌ గండిలో మంగళవారం నీట మునిగిన పంటలను, తడిసిన ధాన్యాన్ని, నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గండి వాటర్‌వర్క్స్‌లో పాడైన మోటార్లను మేయర్‌ కె.సురే్‌షబాబుతో కలసి ఉపముఖ్యమంత్రి పరిశీలించారు.

అన్నదాతలకు ప్రభుత్వం ఆపన్నహస్తం
ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఉపముఖ్యమంత్రి, మేయర్‌

వరి పొలాలను పరిశీలించిన అంజద్‌బాషా, సురే్‌షబాబు

కడప(ఎర్రముక్కపల్లె), నవంబరు 23: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నదాతలకు భరోసా ఇచ్చారు. జవాద్‌ తుఫాను కారణంగా పెన్నానది పరివాహక ప్రాంతమైన పాతకడప, వాటర్‌ గండిలో మంగళవారం నీట మునిగిన పంటలను, తడిసిన ధాన్యాన్ని, నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గండి వాటర్‌వర్క్స్‌లో పాడైన మోటార్లను మేయర్‌ కె.సురే్‌షబాబుతో కలసి ఉపముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలో విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వరదలు వచ్చాయన్నారు. నగరంలో బుగ్గవంకకు ఎన్నడూ లేని విధంగా వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రభుత్వం ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి పెనుఉత్పాతం జరగలేదన్నారు. ఇందుకు కృషి చేసిన కలెక్టర్‌ విజయరామరాజు నేతృత్వంలోని జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. వరదల్లో సర్వం కోల్పోయిన ప్రతి కుంటుంబానికి 25 కేజీల బియ్యం 1 కేజీ ఉర్లగడ్డలు, ఒక లీటర్‌ పామాయిల్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నగర మేయర్‌ సురే్‌షబాబు మాట్లాడుతూ రైతులు పండించిన పంట పూర్తిగా జలమయమై రైతులకు కోలుకోలేని దెబ్బతగిలిందన్నారు. అన్నదాతలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:09:00+05:30 IST