సమసమాజస్థాపనే సీపీఐ లక్ష్యం
ABN , First Publish Date - 2021-12-27T05:06:08+05:30 IST
సమసమాజ స్థాప నే సీపీఐ లక్ష్యమని సీపీఐ సీనియర్ నేత అబ్దుల్‌ఖాదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు.

సీపీఐ ఆవిర్భావ దినోత్సవంలో వక్తలు
వాడవాడలా జెండా ఆవిష్కరణ
పోరుమామిళ్ల, డిసెంబరు 26: సమసమాజ స్థాప నే సీపీఐ లక్ష్యమని సీపీఐ సీనియర్ నేత అబ్దుల్‌ఖాదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద తిరుపతిరెడ్డి కాలనీలో సీపీఐ జెండాను ఆవిష్కరించిన వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా పేద ప్రజలు కార్మిక వర్గం నిరుద్యోగ సమస్య ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదన్నారు. 96 ఏళ్లగా కార్మికుల, రైతుల పేద, ప్రజలకు అండగా నిలబడి సీపీఐ పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు సుబ్రహ్మ ణ్యం పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, మహమ్మద్ రఫి, బెల్లం బాషా పాల్గొన్నారు.
బద్వేలులో...
సీపీఐ ఆవిర్భావ వేడుకలను బద్వేలులో ఘనంగా నిర్వహించారు. సీపీఐ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్, ఆవిష్కరించారు. సీపీఐ కార్యాలయం, జేవీభవనం వద్ద ఆయన జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో జక్కరయ్య, చంద్రమోహన్‌రాజు, సంజీవ్, నరసింహబాబు పాల్గొన్నారు.
మైదుకూరులో...
మైదుకూరు, డిసెంబరు 26: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వీణా విజయరామరాజు కాలనీ, పొట్టి శ్రీరాముల సర్కి ల్, రాయల్ కూడలి, సాయి నాథపురం తదితర ప్రాంతాల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసి నినాదాలు చేశారు సీపీఐ అనేక పోరాటాల్లో పాల్గొందన్నా రు. కార్యక్రమంలో నేతలు పి శ్రీరాములు, వీర య్య, భాస్కర్, షావలి, పవన్‌కుమార్, చేతన్ ర వి తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లెలో...
వేంపల్లె, డిసెంబరు 26: ప్రభుత్వ అధీనంలో ఉ న్న పరిశ్రమలు, కర్మాగారాలు, సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం దారుణమని సీపీఐ పులివెందుల ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పేర్కొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయంలో అరుణపతాకం ఎగుర వేసిన వారు మాట్లాడుతూ దేశ సంపదను తాక ట్టు పెట్టడమే పనిగా పెట్టుకుని దేశంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంద న్నారు. అధికార వైసీపీ జిల్లాలో ఉక్కు పరిశ్రమపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హో దా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నా రు. సీపీఐ నేతలు ఇర్ఫాన్, సుధాకర్, జిలాన్‌బాష, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మంగారిమఠంలో...
బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 26: మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించారు. మధు, హృదయరాజు మాట్లాడుతూ ప్రజలకోసం ఎన్నో పోరాటాలు చేసిం దన్నారు. కార్యక్రమంలో జాలా విజయకుమార్, రైతు సంఘం యూనియన్ నేతలు నారాయణ, రవి, బాలుప్రవీణ, సుబ్బయ్య, ఓబులేసు, రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
