తాగునీటి సమస్య లేకుండా చేయడమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-08-21T04:51:48+05:30 IST

రాయచోటి పట్టణంలో భవిష్యత్‌ తరాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చేయడమే ధ్యేయమని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

తాగునీటి సమస్య లేకుండా  చేయడమే ధ్యేయం

రాయచోటి, ఆగస్టు20: రాయచోటి పట్టణంలో భవిష్యత్‌ తరాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చేయడమే ధ్యేయమని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటి పట్టణంలోని అబ్బవరం గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలో శుక్రవారం జరిగిన వెలిగల్లు అదనపు నీటి పథకంలో భాగంగా రూ.5 లక్షల నీటి సామర్థ్యం గల ట్యాంక్‌ నిర్మాణ భూమిపూజలో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డి, ఫయాజుర్‌ రెహమాన్‌, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబులతో కలిసి ఆయన పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో బేపారి మహమ్మద్‌ఖాన్‌, జాకీర్‌, సాధిక్‌అలీ, సుగవాసి శ్యామ్‌, కొలిమి హరూన్‌, సుగవాసి ఈశ్వర్‌ప్రసాద్‌, ఆనందరెడ్డి, మున్సిపల్‌ డీఈలు సతీష్‌, సుధాకర్‌నాయక్‌, ఏఈలు కృష్ణారెడ్డి, కావ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T04:51:48+05:30 IST