వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-08T04:30:32+05:30 IST
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 7: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. అందు లో భాగంగా పట్టణంలోని శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పరిపాలక మండలి కమిటీవారు, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. కాగా నాగులకట్ట వీధిలోని చౌడేశ్వరీ దేవి ఆల యంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని గురువారం తొలిరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూ జలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
ఎర్రగుంట్ల, అక్టోబరు 7: ఎర్రగుంట్లలోని ఏరువాక గంగమ్మ దేవాల యంలో దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. గురువారం నుంచి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా ప్రారంభించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. కొవిడ్ నిబంధన లను అనుసరించి ఆలయంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు..ఆలయంలోని మూలవిరాట్ అమ్మవారికి ప్రత్యేక పూజా, అలంకార కార్యక్రమాలు నిర్వహించారు. దసరా సందర్భంగా ఆల యాన్ని సుందరంగా తీర్చి దిద్దారు.
ఓంశాంతి కేంద్రంలో ఉత్సవాలు
ప్రొద్దుటూరు టౌన్, అక్టోబరు 7: వైఎంఆర్ కాలనీలోని ఓంశాంతి కేంద్రంలో దసరా ఉత ్సవాలు నిర్వహిస్తున ్నట్లు ఓంశాంతి భవన్ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి హేమ తెలిపారు. పది రోజులపాటు అమ్మవారికి చైతన్యదేవి అలంకారాలు, దేవతాల ఆధ్యాత్మిక భావం, రాజయోగం అనుభూతిని తెలియజేయిస్తామని తెలిపారు.
శివాలయం రాజరాజేశ్వరీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కళాశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్ సర్కిల్‌లో పూజలు నిర్వహించారు. రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సుహాసినులు శివాలయం చేరుకుని గంగాజలంతో కళశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. శాస్త్రీనగర్‌లోని రాజరాజేశ్వరీదేవి ఆల యం, సూపర్‌బజార్‌రోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయం నిర్వాహకులు కలశ పూజను వైభవంగా నిర్వహించారు.
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 7 : దసరా ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు విధుల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసాదరావు సూచించారు. గురువారం స్థానిక పోలీసు అతిధిగృహం ఆవరణలో పోలీసు అధికారులతో, సిబ్బందితో దసరా బందోబస్తు విధినిర్వహణపై డీఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయటి ప్రాంతాల నుంచి పిక్‌పాకెటర్లు వచ్చే అవకాశం ఉందని, అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ పండుగ రోజుల్లో 25 ప్రాంతాల్లో రాకపోకలపై పూర్తిస్థాయిలో ఆంక్షలు పెట్టామని ఆ ప్రాంతాల్లో ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్‌ను గమనిస్తూ ఉంటాన్నారు. సమావేశంలో సీఐలు నాగరాజు, నరసింహారెడ్డి, ఆనందరావు, శుభకుమార్, మంజునాధరెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
కనిపించని సందడి
కొండాపురం, అక్టోబరు 7: మండలంలో ఈ ఏడాది కూడా దసరా సందడి కనిపించలేదు. మండల కేంద్రమైన కొండాపురంలో ఉన్న ఏకైక అమ్మవారి శాల సమీపంలో గండికోట బ్యాక్‌వాటర్ వచ్చిచేరిం ది. దీంతో కొండాపురం ముంపునకు గురికావడంతో ప్రజలు వేర్వేరు చోట్ల వెళ్లిపోవడంతో పట్టణంతో పాటు గ్రామంలో కూడా దసరా సందడి కనిపించలేదు. ముంపు పరిహారం కూడా పూర్తిగా అంద కపోవడంతో ప్రజలు దసరాపై ఆసక్తి చూపడంలేదు
