పంపిణీలో తేడాలొస్తే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2021-07-25T04:46:46+05:30 IST

నిత్యావసర వస్తు వుల పంపిణీలో తేడాలొస్తే ఉపేక్షించేది లేదని తహసీల్దారు రమణారెడ్డి అన్నా రు.

పంపిణీలో తేడాలొస్తే ఉపేక్షించేది లేదు
అడుసువారిపల్లెలో రేషన్‌షాపును పరిశీలిస్తున్న తహసీల్దారు

గోపవరం, జూలై 24: నిత్యావసర వస్తు వుల పంపిణీలో తేడాలొస్తే ఉపేక్షించేది లేదని తహసీల్దారు రమణారెడ్డి అన్నా రు. శనివారం అడుసువారిపల్లె రేషన్‌షాపును తనిఖీ చేసిన ఆయన నిత్యావసర వస్తువుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరుకుల పంపిణీలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేదిలేదన్నారు. పంపిణీలో పారదర్శకం గా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఎఆర్‌ఐ నాగేశ్వరి, వీఆర్వో సుధాకర్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:46:46+05:30 IST