పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2021-03-22T04:58:53+05:30 IST

మండలంలోని కొత్తపేట గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. గంగమ్మ జాతర అనంతరం మొదటి ఆదివారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

పోటెత్తిన భక్తజనం
పూజలు అందుకుంటున్న గంగమ్మ తల్లి

సీకేదిన్నె, మార్చి 21: మండలంలోని కొత్తపేట గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. గంగమ్మ జాతర అనంతరం మొదటి ఆదివారం సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు. జాతరలో భక్తులకు దాతలు పానకం, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 

Updated Date - 2021-03-22T04:58:53+05:30 IST