రాజ్యాంగ ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరాలి
ABN , First Publish Date - 2021-11-27T04:33:16+05:30 IST
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు పూర్తి స్ధాయిలో చే రాలని జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్ పేర్కొన్నారు.

లాడే దినోత్సవంలో జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తంకుమార్
కడప(రూరల్), నవంబరు 26: రాజ్యాంగ ఫలాలు ప్రజలకు పూర్తి స్ధాయిలో చే రాలని జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయసేవాసదన్‌లో డీఎల్‌ఎ్‌సఏ ఆధ్వర్యంలో లాడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చట్టాలను మరింతగా అమలు చేయాలన్నారు. కోర్టులు బలహీనులకు అండగా ఉంటాయన్నారు. భారత న్యాయవ్యవస్ధలో అనేక స్థాయిలలో న్యాయస్థానాలు ఏర్పాటు చేశారన్నారు. న్యాయవ్యవస్థలో కోర్టులు ప్రధాన భాగమన్నారు. రాజ్యాంగ న్యాయస్థానాలు, సివిల్, క్రిమినల్ న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఇవేకాక పన్నులు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, అవినీతి ఆరోపణలను విచారించేందుకు ప్రేత్యేక కోర్టులు ఉన్నాయని పేర్కొన్నారు. చట్టాలు వివిధ హక్కులను కల్పించడమే కాకుండా వాటి పరిరక్షణకు మార్గాలను, బాధ్యతలను నిర్ధేశించడం జరిగింద న్నారు. సాధారణ ప్రజలకోసం 1987లో న్యాయసేవాధికార సంస్థల చట్టాన్ని రూపొందించారన్నారు. దీని ద్వారా పటిష్టమైన ఉచిత న్యాయసేవలను వెనుకబడిన వర్గాలకు, మహిళలకు అందుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటిని ప్రజలు తెలుసుకొని తద్వారా సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ శివరామ్, డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ ఎస్. కవిత, ఫ్యామిలీ కోర్టు జడ్జి గీతా, అడిషినల్ సీనియర్ సివిల్‌జడ్జి హేమలత ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్. కృష్ణన్‌కుట్టి, మొబైల్ కోర్టు జడ్జి ప్రదీ్‌పకుమార్, ఎక్సైజ్‌కోర్టు జడ్జి మోతాలాల్, థర్డ్ ఏడీఎం కోర్టు జడ్జి పెద్దకాసీమ్, సెకండ్ ఏడీఎం కోర్టు జడ్జి రియాజ్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.