కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలగల్లా మారాయి
ABN , First Publish Date - 2021-07-09T04:55:37+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారాన్ని మోపి వారి రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
చెన్నూరు, జూలై 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారాన్ని మోపి వారి రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. ఏఐసీసీపీ పిలుపు మేరకు చెన్నూరులో కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొట్టిపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సైకిలు యాత్ర, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అసాధారణ రీతిలో పెరిగిన పెట్రోలు, డీజలు, వంటగ్యాస్, నిత్యావసర ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారన్నారు. బీజేపీ, వైఎ్‌సఆర్ కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇచ్చింది ధరలు పెంచడానికేనా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన సెంటల్ర్ ఎక్సైజ్ సుంకం ఉపసంహరించుకోవాలని, రాష్ట ప్రభుత్వం అదనపు వ్యాట్‌ను తీసివేయాలన్నారు. అలాగే రోడ్ ట్యాక్స్ తొలగించడం, పెట్రోలు, డీజలు వంట గ్యాస్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నీలి శ్రీనివాసులు, ఉఽపాధ్యక్షుడు శ్రీనివాసులు, గుండ్లకుంట శ్రీరాములు, నేతలు విష్ణుప్రీతంరెడ్డి, బాబు, సుధాకర్‌రెడ్డి, శ్యామలాదేవి, సుబ్రమణ్యంశర్మ తదితరులు పాల్గొన్నారు.