జానమద్ది కృషికి ప్రతి రూపమే బ్రౌన్ గ్రంథాలయం
ABN , First Publish Date - 2021-10-21T04:53:58+05:30 IST
తెలుగు భాషా సాహిత్యాల కోసం జీవితాన్ని అంకి తం చేసిన సీపీ బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని నిర్మించడానికి డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రి అహర్నిశలు శ్రమించారని, ఆయన కృషికి ప్రతిరూపమే బ్రౌన్ గ్రంథాలయమని వైవీయూ వీసీ సూర్యకళావతి అన్నారు.

వైవీయూ వీసీ సూర్యకళావతి
కడప (మారుతీనగర్), అక్టోబరు 20: తెలుగు భాషా సాహిత్యాల కోసం జీవితాన్ని అంకి తం చేసిన సీపీ బ్రౌన్ పేరిట స్మారక గ్రంథాలయాన్ని నిర్మించడానికి డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రి అహర్నిశలు శ్రమించారని, ఆయన కృషికి ప్రతిరూపమే బ్రౌన్ గ్రంథాలయమని వైవీయూ వీసీ సూర్యకళావతి అన్నారు. బుధవారం జానమద్ది హనుమఛ్చాస్త్రి 97వ జయంతిని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. సీపీ బ్రౌన్ సాహిత్యయజ్ఞం జరిపిన ప్రదేశంలో బ్రౌన్ స్మారక భవనాన్ని నిర్మించడం విశేషమన్నారు. ఎంతోమంది సాహితీవేత్తల నుంచి అరుదైన అనేక గ్రంథాలు సేకరించి బ్రౌన్ గ్రంథాలయాన్ని ఒక గొప్ప విజ్ణాన కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. కార్యక్రమానికి ముందు వైవీయూ కులసచివులు ఆచార్య డి.విజయ రాఘవప్రసాద్, సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యుడు మూల మల్లికార్జునరెడ్డి, సలహామండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్, తదితరులు జానమద్ది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.