వర్షం వస్తే ఇక అంతే..!
ABN , First Publish Date - 2021-07-09T05:12:10+05:30 IST
వాణిజ్య రంగంలో రెండో ముంబాయిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాలు చెరువు లు, కుంటలను తలపిస్తున్నాయి.

జలమయమైన నూతన మార్కెట్ రోడ్లపై నిలిచిన వర్షపు నీరు ఈదురు గాలులకు కూలిన చెట్లు
ప్రొద్దుటూరు అర్బన్, జూలై 8 : వాణిజ్య రంగంలో రెండో ముంబాయిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాలు చెరువు లు, కుంటలను తలపిస్తున్నాయి. ఒక వైపు అభివృ ద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తున్నా ఇంకా అక్కడ క్కడ ఇలాంటి పరిస్థితులు తలెత్తడం గమనార్హం. కాగా గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలుప్రాంతాలు జలమయమ య్యాయి. కాలువల్లో కొన్ని చోట్ల చెత్తా చెదారం పేరుకొని వర్షపు నీరు ప్రవాహానికి ఆటంకాలు ఎదురై కాలువల్లోని మురుగునరు రోడ్లపైకి చేరింది. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది కాలువల్లో పేరు కున్న చెత్తను తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పనులు చేపట్టారు. కొత్తగా అనిబిసెంట్ క్రీడా మైదానంలో తాత్కాలికంగా రూ.2 కోట్ల మున్సిపల్ నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ జలమయమైంది. ఆవరణ మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్ర హం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశంలో నీరు నిలిచి తటాకాన్ని తలపిస్తున్నాయి. మార్కెట్ లోని ప్లాట్ ఫాంలలోకి సైతం వర్షం నీరు చేరింది. తెల్లవారు జామున వచ్చే కూరగాయల వాహ నాలు వర్షం నీళ్ళలోనే పచ్చి సరుకు దించుకున్నారు. ఇటీ వల లక్షలు వెచ్చించి సిమెంటు రోడ్ల మీద రోడ్లు వేసిన భారీ వర్షం కురిస్తే మార్కెట్ లోని నీరు బయటికి వెళ్లే మార్గంలేక ఆవరణ లోనే నిలిచి పోతోంది. ఉదయం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వచ్చి వర్షం నీటిని బయట కాలువల్లోకి మరలించా రు. దస్తగిరిపేట, మోడంపల్లె, నడింపల్లె జంగంపే ట, హనుమాన్‌నగర్, సంజీవ్‌నగర్, గురవయ్యతోట రాజబాటవీధి, శ్రీరాంనగర్, కోనేటికాల్వవీధి, గాంధీరో డ్డులలో వర్షంనీరు రోడ్లపై ప్రవహించింది. ప్రధాన కాలువల్లో పూడిక పనులు జరగకపోవడం వల్ల వర్షాకాలంలో కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు మురుగునీటితో నిండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈదురుగాలులకు కూలిన చెట్లు
పట్టణంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. తహసీల్దారు కార్యా లయ ఆవరణలోని పెద్ద వేప చెట్టు కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పిందని డిప్యూటీ తహసీల్దారు మనోహర్ రెడ్డి తెలిపారు.
కుంటను తలపిస్తున్న రోడ్లు
ప్రొద్దుటూరు రూరల్, జూలై 8 : భారీ వర్షంతో నరసింహాపురం గ్రామంలోని రోడ్లు వర్షపునీరు నిలిచి కుంటను తలపిస్తున్నాయి. అంతేగాకుండా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిమెంట్లు ఏర్పాటు చేసి కాలువలు నిర్మించకపోవడం వల్లనే ఏ పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. కాలువలు లేకపోవడంతో వర్షపునీరు పోయే వీలు లేక, రోజుల తరబడి నీరు రోడ్లపైనే ఉంటుందని, దీని వల్ల దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో డ్రైనేజీ కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షపాతం వివరాలు
జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ పరిధిలో గురు వారం కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నా యి. జమ్మలమడుగుల 33.4 మిల్లీమీటర్లు పెద్దము డియంలో 35,4, మైలవరంలో 31.4 ముద్దనూరులో 7.8, కొండాపురంలో 1.2, రాజుపాళెం లో 3.4, ప్రొ ద్దుటూరులో 53.4, చాపాడులో 42.6, దువ్వూరులో 11.2, మైదుకూరులో 79.0 , సింహాద్రి పురంలో 21.4, వేంపల్లిలో 8.2, తొండూరులో 16.4 మిల్లీమీట ర్ల వర్షం కురిసినట్లు సంబంధిత అధికారులు వెల్ల డించారు. కాగా ప్రొద్దుటూరు చాపాడు మైదుకూరు లలో భారీ వర్షం కురిసినట్లు తెలిపారు.
