అభ్యర్థులకు ధన్యవాదాలు

ABN , First Publish Date - 2021-03-23T04:53:47+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటరు, కౌన్సిలర్లుగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులందరికి పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శైలజానాధ్‌ సోమవారం జూమ్‌ మీటింగ్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు ఎన్నికల్లో కృషిచేస్తే ఫలితాలు కాంగ్రె స్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు.

అభ్యర్థులకు ధన్యవాదాలు

జూమ్‌ మీటింగ్‌లో శైలజానాధ్‌

కడప(కలెక్టరేట్‌), మార్చి 22: మున్సిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటరు, కౌన్సిలర్లుగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులందరికి పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శైలజానాధ్‌ సోమవారం జూమ్‌ మీటింగ్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు ఎన్నికల్లో కృషిచేస్తే ఫలితాలు కాంగ్రె స్‌కు అనుకూలంగా ఉంటాయన్నారు. కాగా అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసిందని జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు పీసీసీ అధ్యక్షుడికి వివరించారు. ఇదిలా ఉండగా 26న తలపెట్టిన భారత్‌బంద్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు శైలజానాధ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-23T04:53:47+05:30 IST