వైసీపీ అరాచకపాలనకు బుద్ధి చెప్పండి

ABN , First Publish Date - 2021-10-26T04:50:17+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనకు బుద్ది చెప్పి బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేసి కమలమ్మను గెలిపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు.

వైసీపీ అరాచకపాలనకు బుద్ధి చెప్పండి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్‌

రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌


పోరుమామిళ్ల, అక్టోబరు 25 : రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనకు బుద్ది చెప్పి బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటు వేసి కమలమ్మను గెలిపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలన నియంత పాలనగా ఉందన్నారు.  బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. కమలమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.  కమల్మను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తుందన్నారు. బద్వేలు నియోజకవర్గ వైసీపీ నాయకుల ఒత్తిడి, పెత్తందారి వ్యవస్థ ఎక్కువ కావడంతోనే డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మృతి చెందాడని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వల్లి, ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-26T04:50:17+05:30 IST