ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-29T05:11:56+05:30 IST

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడి ్డ డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 28: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడి ్డ  డిమాండ్‌ చేశారు. గురువారం సంఘం కార్యాలయంలో చలో విజయవాడ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ పీఆర్‌సీని వెంటనే అమలు, సీపీఎస్‌ రద్దు, ఆరు విడతల డీఏ మంజూరులో జాప్యానికి నిరసనగా నవంబరు రెండవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులు, పెన్షనర ్లకు 55 శాతం ఫిట్‌మెట్‌ తో 2018 జూలై 1 నుంచి నూతన పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం దశలవారీ ఆందోళనలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ సమస్యను పరిష్కరించి ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో ప్రవేశపెట్టిన యాప్‌లను రద్దు చేయాలని, ఎయిడెడ్‌, మాడల్‌ స్కూల్‌, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విభజించడం తగదన్నారు. ఈకార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి , కృష్ణారెడ్డి, కుళాయిరెడి ్డ, పుల్లారెడ్డి, మునివర్ధన్‌కుమార్‌, అమీన్‌, వెంకటేశ్వర్లు, అన్వర్‌బాష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:11:56+05:30 IST