శిరీష కుటుంబానికి టీడీపీ అండ

ABN , First Publish Date - 2021-06-22T04:16:15+05:30 IST

ప్రేమ ఉన్మాది చేతిలో హత్యకు గురైన శిరీష కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంద ని టీడీపీ నియోజకవ ర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ హామీ ఇచ్చారు.

శిరీష కుటుంబానికి టీడీపీ అండ
శిరీష కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఓబుళాపురం రాజశేఖర్‌

బద్వేలు, జూన 21: ప్రేమ ఉన్మాది చేతిలో హత్యకు గురైన శిరీష కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుంద ని టీడీపీ నియోజకవ ర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ హామీ ఇచ్చారు.  శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ

మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వీరారెడ్డిట్రస్టు తరపున ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు.  హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  విజయవాడ దుర్ఘటనలో జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, జయరామిరెడ్డి, రమణారెడ్డి, రామలక్ష్మిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, మిత్తికాయల రమణ,  నరసింహారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T04:16:15+05:30 IST