పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-11T05:24:35+05:30 IST

పులివెందులను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులకు సూచించారు.

పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్‌

పులివెందుల టౌన్‌, ఆగస్టు 10: పులివెందులను మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులకు సూచించారు. మంగళవారం ఏపీకార్ల్‌లో మోడల్‌ టౌన్‌పై జేసీ గౌతమితో కలిసి అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన రివ్యూలో కలెక్టర్‌ మాట్లాడుతూ పులి వెందులలో 80 అడుగులు రోడ్డు విస్తరించనున్నామని ఎటువంటి సమస్యలు తలెత్త కుండా చూడాలన్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములను త్వరితగతిన గుర్తించా లన్నారు. మోడల్‌ టౌన్‌ పనులపై ప్రతి మంగళవారం రివ్యూ ఉంటుందన్నారు. 

Updated Date - 2021-08-11T05:24:35+05:30 IST