కార్మిక సంఘాలతో రేపు చర్చలు

ABN , First Publish Date - 2021-08-26T04:59:16+05:30 IST

ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మిక సంఘం నాయకులను ఈ నెల 27న అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ అధికారులు చర్చలకు ఆహ్వానించినట్లు ఏపీఎండీసీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ అనుబంధ గౌరవాధ్యక్షుడు సి.హెచ్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

కార్మిక సంఘాలతో రేపు చర్చలు

ఓబులవారిపల్లె, ఆగస్టు25 : ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మిక సంఘం నాయకులను  ఈ నెల 27న అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ అధికారులు చర్చలకు ఆహ్వానించినట్లు ఏపీఎండీసీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ అనుబంధ గౌరవాధ్యక్షుడు సి.హెచ్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. మంగంపేటలో ఏపీఎం డీసీ కార్యాలయం వద్ద  ఔట్‌సోర్సింగ్‌, ట్రైనింగ్‌ కార్మికు లను రెగ్యులర్‌ చేయాలని బుధవారం కూడా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి, బండారి భాస్కర్‌, అధ్యక్షుడు కుప్పాల సుబ్రహ్మణ్యం, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-26T04:59:16+05:30 IST