తైబాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-12-07T05:35:32+05:30 IST

హైదరాబాద్‌లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఏసియన్‌ అంతర్జాతీయ తైబాక్సింగ్‌ పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో హేమశ్రీ బంగారు పతకం, సిరి చందన రజత పతకం, హేమవందన కాంస్య పతకం సాధించారు.

తైబాక్సింగ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఏసియన్‌ తైబాక్సింగ్‌ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 6: హైదరాబాద్‌లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఏసియన్‌ అంతర్జాతీయ తైబాక్సింగ్‌ పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థులు ప్రతిభ చాటారు. సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో హేమశ్రీ బంగారు పతకం, సిరి చందన రజత పతకం, హేమవందన కాంస్య పతకం సాధించారు. అండర్‌ -12 సబ్‌ జూనియర్‌ బాలుర విభాగంలో సాత్విక్‌, పునీత్‌రెడ్డి, రజత పతకాలు, అండర్‌-9 విభాగంలో సాయి సాత్విక్‌రెడ్డి, సుదీ్‌పకుమార్‌, మహిరెడ్డి కాంస్య పతకాలు సాధించారు. అండర్‌-12 విభాగంలో రామ్‌ చరణ్‌రెడ్డి, శరత్‌ శంకర్‌రెడ్డి కాంస్య పతకాలు సాధించగా, బంగారు పతకం సాధించిన హేమశ్రీ ఫిబ్రవరిలో థాయిల్యాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ తైబాక్సింగ్‌ పోటీల్లో పొల్గొంటుందని మాస్టర్‌ మునీశ్వర్‌ తెలిపారు.


Updated Date - 2021-12-07T05:35:32+05:30 IST