ప్రజల గోడు పట్టించుకోండి

ABN , First Publish Date - 2021-11-24T05:10:26+05:30 IST

కడప నగరం 48వ డివిజన్‌ పరిఽధిలోని ముంపు ప్రజల గోడు పట్టించుకోవాలని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సచివాలయాన్ని వారు ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నగర్‌, చెంచుకాలనీ, ఆచారి కాలనీ, నంద్యాల నాగిరెడ్డి కాలనీ, రామాంజనేయనగర్‌ కాలనీ వాసులను వరదనీటి మునక నుంచి తక్షణమే కాపాడాలని, ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారద్రోలాలన్నారు.

ప్రజల గోడు పట్టించుకోండి
సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న నేతలు

సచివాలయాన్ని ముట్టడించిన సీపీఐ నేతలు

కడప(ఎర్రముక్కపల్లె), నవంబరు 23: కడప నగరం 48వ డివిజన్‌ పరిఽధిలోని ముంపు ప్రజల గోడు పట్టించుకోవాలని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సచివాలయాన్ని వారు ముట్టడించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నగర్‌, చెంచుకాలనీ, ఆచారి కాలనీ, నంద్యాల నాగిరెడ్డి కాలనీ, రామాంజనేయనగర్‌ కాలనీ వాసులను వరదనీటి మునక నుంచి తక్షణమే కాపాడాలని, ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారద్రోలాలన్నారు. గతేడాది నవంబరు 28న జేసీ గౌతమి, పృధ్వీతేజలు ఈ ముంపు ప్రాంతంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్‌ చేశారు. 


లక్ష్మిరెడ్డి సంఘీభావం 

టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, జమాలయ్య, తదితరులు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ప్రజల వరద నీటి ముంపు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేశారు. 

సమస్యలు పరిష్కరిస్తాం 

ఎమ్మార్వో, ఎస్‌ఐ 

కడప తహసీల్దార్‌ శివరామిరెడ్డి ధర్నా వద్దకు విచ్చేసి వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తాలూకా ఎస్‌ఐ హుస్సేన్‌, రామకృష్ణ తదితరులు పోలీసులు బాధిత ప్రజలకు న్యాయం జరిగేందుకు దోహదపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి సభ్యులు సావంత్‌ సుధాకర్‌, మునయ్య, మనోహర్‌రెడ్డి, మద్దిలేటి, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T05:10:26+05:30 IST