విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-05-25T04:59:55+05:30 IST
ప్రతి జర్నలిస్టు విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. కడప నగరం ఉమే్‌షచంద్ర కళ్యాణ మండపంలో నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, మందులు, డ్రైఫ్రూట్స్ కలిగిన కిట్లను సోమవారం పంపిణీ చేశారు.

జర్నలిస్టులకు కిట్లను అందించిన ఎస్పీ అన్బురాజన్
కడప(క్రైం), మే 24: ప్రతి జర్నలిస్టు విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. కడప నగరం ఉమే్‌షచంద్ర కళ్యాణ మండపంలో నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, మందులు, డ్రైఫ్రూట్స్ కలిగిన కిట్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్ర మత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటిస్తూ, డబుల్ మాస్కులు ధరించి, చేతులను శానిటైజరుతో శుభ్రం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు మనోధైర్యంతో ఉండాలని, చాలా మందిలో భావోద్వేగాలతో ఆక్సిజన్ శాతం తగ్గుతుందని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సూచించారు. పోలీసు సంక్షేమశాఖ వైద్యురాలు డాక్టర్ సమీరాభాను మాట్లాడుతూ ప్రస్తుత కరోనాతో పాటు బ్లాక్, వైట్ ఫంగస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది చిన్న చిన్న రోగాలకు స్టెరాయిడ్స్ ఎక్కువ ఉపయోగిస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని, వైద్యుని సలహాలు సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, కడప డీఎస్పీ సునీల్, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, ఉపాధ్యక్షులు ఉప్పు శంకర్, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.