శిక్షణా తరగతులను వినియోగించుకోండి
ABN , First Publish Date - 2021-10-22T04:45:27+05:30 IST
శిక్షణా తరగతులను వార్డు సభ్యు లు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి సూచించారు.
సిద్దవటం, అక్టోబరు21 :శిక్షణా తరగతులను వార్డు సభ్యు లు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన శిక్షణా తరగతుల ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వా ర్డు సభ్యుల విధులు, బాధ్యతలపై శిక్షణలో మాస్టర్ ట్రైన ర్లు సబ్జెక్టుల వారీగా వివరిస్తారన్నారు. రాజంపేట డీఎల్‌పీఓ నాగరాజు మాట్లాడుతూ వార్డు సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే సభ్యత్వాన్ని కోల్పోతారన్నారు.జిల్లా కో-ఆర్డినేటర్ సురే్‌షబాబు మాట్లాడు తూ ప్రభుత్వ పథకాలపై వార్డు సభ్యులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంపీడీఓ ప్ర తాప్, మాస్టర్ ట్రైనర్లు మెడిటేషన్ ట్రైనర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.