స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-01-13T05:15:10+05:30 IST

యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద అని వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్‌ సోమా లక్ష్మినరసయ్య పేర్కొన్నారు.

స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి
వివేకానందస్వామి విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, జనవరి 12: యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద అని వివేకానంద  సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్‌ సోమా లక్ష్మినరసయ్య పేర్కొన్నారు. స్వామి వివేకానంద 158వ జయంతిని పురష్కరించుకు ని గీతాశ్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ వివేకానంద క్లాత్‌మార్కెట్‌లోని వివేకానందుని విగ్ర హం వరకు పాదయాత్ర నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడు ప్రముఖ ప్రజ్ఞాశాలి అని  పేర్కొన్నారు.  కార్యక్రమంలో  నాగార్జున, మల్లికార్జునరావు, చలపతి, మార్కండేయ, రవీంద్రనాథ్‌, కేశవరెడ్డి పాల్గొన్నారు. 

 సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ...

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద క్లాత్‌మార్కెట్‌లోని వివేకానందుని విగ్రహానికి సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి  తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రాంప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు, డాక్టర్‌ వరుణ్‌కుమార్‌రెడ్డి, అంకాల్‌కొండయ్య, రవీంద్రనాథరెడ్డి, మధుసూదన్‌బాబు, రామచంద్ర, ఓబుళరెడ్డి పాల్గొన్నారు.

 రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో...

రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు పెంచలయ్య, కార్యదర్శి మల్లికార్జున, వాసు, క ళాశాల కరస్పాండెంట్‌ తరునేందుశేఖర్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు రామకృష్ణ, హరినాథ్‌ పాల్గొని వివేకానందుడికి నివాళులర్పించారు.


 చైతన్యసాంఘిక సేవా సంఘం ఆధ్వర్యంలో...

చైతన్య సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు 110 మందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కరుమూరు వెంకటరమణయ్య, ఈశ్వర్‌రెడ్డి, అధ్యాపకుడు పల్లా లక్ష్మినరసింహులు పాల్గొన్నారు. 

కొండాపురంలో స్వామి వివేకానంద జయంతి 

కొండాపురం, జనవరి 12: స్వామి వివేకానంద జయంతిని కొండాపురంలో మంగళవారం  ఘనంగా నిర్వహించారు. నేటి యువతకు వివేకానందుడు ఆదర్శమని ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందకు నివాళులర్పించారు.

జాతికి మార్గదర్శి స్వామి వివేకానంద

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 12 : భారతజాతికి మార్గదర్శి స్వామివివేకానంద అని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ గొర్రెశ్రీనివాసులు కొనియాడారు. స్వా మి వివేకానంద జయంతి ని పురస్కరించుకుని స్థానిక వివేకానంద కాంప్టెక్స్‌లోని  వి వేకానందుని విగ్రహానికి బీజేపీ నేతలు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీజేపీ నేత గొర్రెశ్రీను మాట్లాడుతూ  చిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలన్నీ పర్యటించి  భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ప్రచారం చేశాడన్నారు.యువతకు ఆయన రచనలు ఎంతో స్పూర్తి దాయకమైనవన్నారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుబ్రమణ్యం, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు పుత్తా నరసింహారెడ్డి, నరే్‌ష, పరమేష్‌, సహదేవరెడ్డి, నరసింహులు, శ్రీశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:15:10+05:30 IST