ప్రాణంతీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2021-12-20T05:03:59+05:30 IST

ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత ప డ్డాడు.

ప్రాణంతీసిన ఈత సరదా

పూతలపట్టు, డిసెంబరు 19: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత ప డ్డాడు. రాజంపేటకు చెందిన విజయ్‌(19) చిత్తూ రు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవులు సమీపంలో ఉన్న రావూరి వెంకటస్వామి ఇంజి నీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండవ సంవత్సరం చ దువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో న లుగురు స్నేహితులతో కలిసి వావిల్‌తోట పం చాయతీ నయనంపల్లె సమీపాన నీవానదిలోకి ఈతకు వెళ్లాడు. ఈతరాని విజయ్‌ ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.

Updated Date - 2021-12-20T05:03:59+05:30 IST