పోరుమామిళ్లలో విస్తరణ పనుల సర్వే

ABN , First Publish Date - 2021-06-20T04:37:47+05:30 IST

పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రభాకర్‌నాయుడు, డీఈ రమేష్‌, ఏఈ రామక్రిష్ణారెడ్డి సిబ్బందితో సర్వే నిర్వహించారు.

పోరుమామిళ్లలో విస్తరణ పనుల సర్వే

పోరుమామిళ్ల, జూన 19: పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రభాకర్‌నాయుడు, డీఈ రమేష్‌, ఏఈ రామక్రిష్ణారెడ్డి సిబ్బందితో సర్వే నిర్వహించారు. పోరుమామిళ్లలో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండడం తో రోడ్డు విస్తరణ చేసి డివైడరు  ఏర్పాటు చేస్తే పట్టణం అందంగా తయారవుతుందని మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అంచనాలు వేయించి ప్రతిపాదనలు పంపారు.

రోడ్డు విస్తరణకు దాదాపు రూ.25కోట్లు నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి ఆర్‌అండ్‌బీ అధికారులు పోరుమామిళ్ల లో సర్వే నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం కార్యాల యం నుంచి మల్లకతువ వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్లు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు విస్తరణపై పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్‌ అధికారులతో మాట్లాడారు.  


Updated Date - 2021-06-20T04:37:47+05:30 IST