క్షతగాత్రులను ఆదుకోవాలి: సీఐటీయూ
ABN , First Publish Date - 2021-05-09T04:45:21+05:30 IST
ముగ్గురాళ్లగనుల్లో బ్లాస్టింగ్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు.

కడప (రవీంద్రనగర్), మే 8 : ముగ్గురాళ్లగనుల్లో బ్లాస్టింగ్ వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూనియన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులైన వారికి మెరుగైన ఉచిత వై ద్యం అందించాలని, రూ.25లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణం యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలన్నారు.