పెళ్లి చేయలేదనే మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-05T05:44:47+05:30 IST

పెళ్లి చేయలేదనే మనస్థాపంతో గురువారం నరాల వెంకటేశ్వరరెడ్డి (25) అనే యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

పెళ్లి చేయలేదనే మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
వెంకటేశ్వర్‌రెడ్డి మృతదేహం

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 4: పెళ్లి చేయలేదనే మనస్థాపంతో గురువారం నరాల వెంకటేశ్వరరెడ్డి (25) అనే యువకుడు ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు... జమ్మలమడుగు పట్టణంలోని నాగులకట్ట వీధిలో నివశిస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డి  బేల్దా రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తనకు వివాహం చేయమని తండ్రిని అడిగేవాడు. మృతుడి తండ్రి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు కాగా,  వెంకటేశ్వర్‌రెడ్డి రెండవ కుమారుడు. పెద్దకుమారుడి వివాహం చేసిన తర్వాత చేస్తామని తండ్రి చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరెడ్డి మనస్థాపం చెంది ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ మురళీయాదవ్‌ తెలిపారు.

Updated Date - 2021-02-05T05:44:47+05:30 IST