సచివాలయం ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-07-13T05:10:34+05:30 IST

మండల పరిధిలోని తోళ్లగంగనపల్లె గ్రామ సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

సచివాలయం ఆకస్మిక తనిఖీ
రికార్డులు పరిశీలిస్తున్న జేసీ

వల్లూరు, జూలై 12: మండల పరిధిలోని తోళ్లగంగనపల్లె గ్రామ సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ధర్మచంద్రారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు, సమస్యలు వస్తే మండల స్థాయి అధికారులతో చర్చించి వాటిని రూపుమాపాలన్నారు. వీరి వెంట స్థానిక కార్యదర్శి సువర్ణ, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులరెడ్డి, ఇంజనీరింగ్‌, హౌసింగ్‌ తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:10:34+05:30 IST