రైతులను ఆదుకునేందుకే సబ్సిడీతో విత్తనాలు

ABN , First Publish Date - 2021-12-08T04:54:34+05:30 IST

భారీగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకునేందుకే నష్టపోయిన వారికి మళ్లీ 80 శాతం సబ్సిడీతో విత్తన శనగలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

రైతులను ఆదుకునేందుకే  సబ్సిడీతో విత్తనాలు
శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న దృశ్యం

ఎర్రగుంట్ల, డిసెంబరు 7: భారీగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకునేందుకే నష్టపోయిన వారికి మళ్లీ 80 శాతం సబ్సిడీతో విత్తన శనగలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన పోట్లదుర్తిలోని రైతు భరోసా కేం ద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో శనగరైతుల సాగు చేసి పంట పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి మళ్లీ సాగు చేసుకునేందుకు సహాయం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏవో అరుణ, సుధాకర్‌రెడ్డి, రైతులు, పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:54:34+05:30 IST