అటవీ గ్రామాల్లో పర్యటించిన సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

ABN , First Publish Date - 2021-12-08T04:53:11+05:30 IST

వరదల మూలంగా చెయ్యేటికి అవతల అటవీ ప్రాంతంలో ఉన్న తొగూరుపేట గ్రామ పంచాయతీ చింతలకోన గ్రామాన్ని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం పరిశీలించారు.

అటవీ గ్రామాల్లో పర్యటించిన సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌
చింతలకోన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట, డిసెంబరు7 : వరదల మూలంగా చెయ్యేటికి అవతల అటవీ ప్రాంతంలో ఉన్న తొగూరుపేట గ్రామ పంచాయతీ చింతలకోన గ్రామాన్ని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు  అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ విశాలాక్షి, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T04:53:11+05:30 IST