నీటి సంపులో పడి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2021-11-10T05:15:18+05:30 IST

మండలంలోని బోనాల గ్రామంలో ఓ విద్యార్థి నీటి సంపులో పడి మృతిచెందాడు.

నీటి సంపులో పడి విద్యార్థి మృతి
సంపులో పడి మృతిచెందిన చరణ్‌ (ఫైల్‌ఫొటో)

లింగాల, నవంబరు 9: మండలంలోని బోనాల గ్రామంలో ఓ విద్యార్థి నీటి సంపులో పడి మృతిచెందాడు. ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి కథనం మేరకు.. బోనాల గ్రామానికి చెందిన శ్రీరాములు, గంగాదేవి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి చరణ్‌ ఒక్కడే కొడుకు. ఈ బాలుడు స్థానికంగా ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనం అనంతరం మరో ముగ్గురు బాలురతో కలసి చరణ్‌ బహిర్భూమికి వెళాడు. స్కూలు పక్కనే ఉన్న రైతు నీటి సంపులో ప్రమాదశాత్తు చరణ్‌ పడిపోయాడు. వెంట ఉన్న విద్యార్థులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం తెలిపారు. వారు, చరణ్‌ బంఽఽధువులు సంపు వద్దకు చేరుకుని నీటిలోంచి విద్యార్థిని బయటకు తీసి పులివెందుల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు నీటి సంపులో పడి మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


  

Updated Date - 2021-11-10T05:15:18+05:30 IST