సమస్యల పరిష్కారానికి పోరాటం : అవ్వారు

ABN , First Publish Date - 2021-03-22T04:56:24+05:30 IST

నగర పరిధిలోని 50 డివిజన్లలో గత కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు బీసీ మహాసభ జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లిఖార్జున స్పష్టం చేశారు.

సమస్యల పరిష్కారానికి పోరాటం : అవ్వారు

కడప(మారుతీనగర్‌), మార్చి 21: నగర పరిధిలోని 50 డివిజన్లలో గత కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు బీసీ మహాసభ జాతీయ కన్వీనర్‌ అవ్వారు మల్లిఖార్జున స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక పాత రిమ్స్‌ సమీపంలోని ఆ మహాసభ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం కార్పొరేషన్‌గా మారిందే తప్ప ఏ మాత్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయలేదన్నారు. నగరాన్ని సింగపూర్‌ సిటీ చేస్తామని బీరాలు పలికిన నేతలంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించడంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఆ మహాసభ నాయకులు కోదండరామ్‌, కదిరి ప్రసాద్‌, షిండే భాస్కర్‌, రామమోహన్‌, ఎరికలయ్య, సుబ్బరాయుడు ఆచారి, బాలరాజు, శ్రీనివాసులు, నాగరాజు, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T04:56:24+05:30 IST