కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-19T04:13:03+05:30 IST

రైల్వేకోడూరులో గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్న అగ్రవర్ణాలపై కఠి న చర్యలు తీసుకోవాలంటూ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

కఠిన చర్యలు తీసుకోవాలి
బద్వేలులో నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

బద్వేలు, మే 18: రైల్వేకోడూరులో గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్న అగ్రవర్ణాలపై కఠి న చర్యలు తీసుకోవాలంటూ కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏవీపీఎస్‌ పట్టణాధ్యక్షుడు గిలకరాజు మాట్లా డుతూ వీవీకండ్రిక గిరిజనులకు పట్టా భూముల్లో 15 ఏళ్ల నుంచి మామిడి చెట్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారన్నారు. కాగా కొందరు బోగస్‌ పట్టాలు సృష్టించి గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

15 ఏళ్ల కిందటే 15 గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇచ్చారని, ఉపాధి పనులు చేసి మామిడి చెట్లను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇందులో ఎస్టీ కార్పొరేషన ద్వారా బోర్లు వేసి ట్రాన్సపార్మర్‌, మోటారు బిగించారన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గిరిజనుల పేరుతోనే నమోదై ఉన్నాయన్నారు. కొందరు నకిలీ పట్టాలు సృష్టించి గిరిజనులను బెదిరించి దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. తక్ష ణమే రెవెన్యూ అధికారులు చర్యలు గిరిజనులకు న్యాయం చేయాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏవీపీఎస్‌ నాయకులు బ్రహ్మయ్య, జయరాజు, ప్రవీణ్‌కుమార్‌, రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-19T04:13:03+05:30 IST