శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-02-02T04:45:56+05:30 IST

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బీవీ కిష్ణ్రయ్య హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
రామాపురంలో ప్రజలకు సూచనలిస్తున్న ఎస్‌ఐ

గోపవరం, ఫిబ్రవరి 1: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ బీవీ కిష్ణ్రయ్య హెచ్చరించారు. సోమ వా రం మండలంలోని రాచాయిపేట, రామాపురం, బ్రాహ్మణపల్లె పం చాయతీల్లో ఆయన తన సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల ప్ర జలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచా యతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో గొడవలు, తగాదాలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే వెంటనే పోలీసుల దృష్టికి తేవాలని ఆయన ప్రజలకు సూచిం చా రు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T04:45:56+05:30 IST