నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

ABN , First Publish Date - 2021-11-24T05:09:57+05:30 IST

నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ

కడప(క్రైం), నవంబరు 23: నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా పోలీసుశాఖ కొరడా ఝుళిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన షాపుల వారిపై, షాపుల వద్ద వినియోగదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టని వారిపై కేసులు, అలాగే మాస్క్‌ ధరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగే వారికి జరిమానా విధిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం మాస్క్‌ ధరించని 224 మందిపై కేసులు నమోదు చేసి రూ.31,545 జరిమానా విధించామన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీసు శాఖకు సహకరించాలన్నారు. తమ సంరక్షణ, ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఎస్పీ కోరారు. 

Updated Date - 2021-11-24T05:09:57+05:30 IST