చిన్నపాటి వర్షానికే జలమయమైన వీధులు

ABN , First Publish Date - 2021-10-31T06:01:23+05:30 IST

కురిసిన కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమవడం కుంటలను తలపించడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

చిన్నపాటి వర్షానికే జలమయమైన వీధులు
కుంటను తలపిస్తున్న రోడ్డు

పోరుమామిళ్ల, అక్టోబరు 30: కురిసిన కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమవడం కుంటలను తలపించడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి మహత్మాగాంధీ విగ్రహం వెనుకవైపున ఉన్న రోడ్డు లో వర్షం నీరు చేరి ఆ ప్రాంతమంతా నీటి కుంటను తలపించింది.  నీరు వెళ్లే దారి లేక అక్కడే నిల్వ ఉండడంతో ఆ లోతును గమనించిన వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు. 

Updated Date - 2021-10-31T06:01:23+05:30 IST