ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించాలి

ABN , First Publish Date - 2021-02-07T04:40:44+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శివనారాయణ డిమాండ్‌ చేశారు.

ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించాలి

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శివనారాయణ డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలకు సిధ్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


పర్యావరణానికి మొక్కలు నాటాలి

జమ్మలమడుగు రూరల్‌, ఫిబ్రవరి 6: పర్యావర ణానికి విరివిగా మొక్కలు నాటాలని ఆర్డీవో పరిపాలనాధికారి ఇక్బాల్‌బాష పేర్కొన్నారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ ఆవరణలో శనివారం  ఆర్డీవో నాగన్న ఆదేశాల మేరకు పచ్చదనం-పరిశుభ్రతలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దారు తిరుపతయ్య, డిప్యూటీ తహసీల్దారు నిజాముద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:40:44+05:30 IST