నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-17T05:04:32+05:30 IST

మండల పరిధిలోని పెద్దపుత్త గ్రామంలో నేటి నుంచి సీతా, లక్ష్మణ, హనుమత్‌ సమేత రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని కార్యనిర్వాహకులు తెలిపారు.

నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు

వల్లూరు, ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని పెద్దపుత్త గ్రామంలో నేటి నుంచి సీతా, లక్ష్మణ, హనుమత్‌ సమేత రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని కార్యనిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠ కార్యక్రమంలో వివిధ పూజలు, హోమాలతో పాటు సీతారాముల కల్యాణం నిర్వహిస్తామని, 17న శనివారం ఉదయం 8 గంటలకు గణపతిపూజ, స్వస్తివచనం, గ్రహమూర్తులకు మహన్యాస పూర్వక ఏకాదశ రుదాభ్రిషేకాలు, కలశస్థాపన అనంతరం మంగళహారతి, తీర్థ ప్రసాదాల వినియోగం ఉంటుందన్నారు. సాయంత్రం ప్రదోషకాల పూజ, 18న ఆదివారం వివిధ అభిషేకాలతో పాటు ప్రధాన హోమాలు, 19న ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం ఉంటుందన్నారు. 21న ఉదయం  10 నుంచి 11 గంటల వరకు సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:04:32+05:30 IST