ఈకేవైసీ కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-08-22T05:10:24+05:30 IST

ప్రతి రేషన్‌ దారుడు ఆధార్‌ ఈకేవైసీ చేయించుకోవాలంటే పడిగాపు లు తప్పడం లేదు.

ఈకేవైసీ కోసం పడిగాపులు
నిర్వాహకుడిని చుట్టుముట్టిన రేషన్‌ దారులు

మైదుకూరులో ఉన్నది రెండు కేంద్రాలే 

పోరుమామిళ్లలో తహసీల్దారుకు వినతి పత్రం ఇచ్చిన సీపీఐ నేతలు

మైదుకూరు, ఆగస్టు 21: ప్రతి రేషన్‌ దారుడు ఆధార్‌ ఈకేవైసీ చేయించుకోవాలంటే పడిగాపు లు తప్పడం లేదు. పట్టణంలో ఏపీజీ బ్యాంకు, పోస్టాపీసు కేంద్రాలు ఉండండతో రేషన్‌ దారు లు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ దాదాపు వందల సంఖ్యలో ఈకేవైసీ కోసం వస్తుంటే కేవ లం 40 మందికి మాత్రమే వారానికి పైగా టోక న్లు ఇస్తున్నారు.

పైగా మరో వారంలో చివరి తే దంటూ ప్రచారం సాగడంతో ఈ రెండు కేంద్రా ల్లో ఉదయం 8 నుంచి పడిగాపులు పడుతున్నా రు. అయితే అధికారులు మాత్రం ఈకేవైసీకి చి వరి తేది లేందటూ చెబుతున్నా ఎక్కడ రేషన్‌ రద్దు చేస్తారనే భయంతో ఆధార్‌ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉండగా రేషన్‌ దారులకు కనీసం కూర్చునేందుకు కుర్చీలు,గానీ తాగునీటి సౌకర్యం లేదు. గుంపులు గుంపులు వస్తూ తోపులాడుతున్నారు. పోలీసు డ్యూటీ ఉం చాలని, మౌలిక వసతులు కల్పించాలని జాయిం ట్‌ కలెక్టర్‌ గౌతమి ఆదేశించినా మైదుకూరులో మాత్రం పాటించడం లేదు.

మండలంలో దాదా పు 10 వేల మంది వరకు ఈకేవైసీ చేయించుకు నే వారున్నారని అంచనా వేశారు. ఉన్న రెండు కేంద్రాల్లో ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వం సచివాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంకా అమలు కాక పోవడంతో ఆధార్‌ ఈకేవైసీ కోసం తిప్పలు పడుతున్నారు. ఈవిష యమై తహసీల్దారు ప్రేమంతకుమార్‌ వివరణ ఇస్తూ మండల కార్యాలయం వద్ద  మరో ఆధార్‌ కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. 

ఈకేవైసీ అవస్థలు తప్పించండి

పోరుమామిళ్ల, ఆగస్టు 21: శాశ్వత ఆఽధార్‌ కేం ద్రం లేకపోవడంతో ఆధార్‌ ఈకేవైసీతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్‌, ఏఐటీయూసీ నేత మహ్మద్‌రఫి పేర్కొన్నారు. శనివారం వారు విలే కరులతో మాట్లాడుతూ దాదాపు 60వేల జనాభా కలిగిన మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రేషన్‌ కార్డుల్లో ఉన్న ప్రతి వ్యక్తీ కేవైసీ చేయాలని గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలురావడం, ఆధార్‌ కేంద్రాలు పనిచేయలేక అవస్థలు పడుతున్నారన్నారు.

పోస్టాఫీసు ఉదయం 10 నుంచి  సా యంత్రం 5 వరకు ఈకేవైసీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్‌కార్డులో చిన్న పిల్లలు ఫింగర్‌ ప్రింట్‌ అప్‌డేట్‌ చేయాలని, కొత్త ఆధార్‌ తీసి లింకు చేస్తామని ఆధార్‌ కేంద్రం యాజమాన్యం మండల ప్రజలను ముప్పు  తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. అదనంగా వంద రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. దీంతో కలసపాడు, కాశినాయన ప్రాంతాలకు  వెళ్లి అక్కడ కూడా పని కాక మళ్లీ వెనక్కి వస్తున్నారన్నారు. కావున జిల్లా అధికారులు చొరవ తీసుకుని ఆధార్‌ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. Updated Date - 2021-08-22T05:10:24+05:30 IST