సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష : ఎంపీ

ABN , First Publish Date - 2021-07-09T04:59:16+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలిచాయ ని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్ష : ఎంపీ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ అవినాశ్‌రెడ్డి

పులివెందుల, జూలై 8: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలిచాయ ని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. ధ్యాన్‌చంద్‌ క్రీ డా మైదానంలో నిర్వహించిన రై తు దినోత్సవం (వైఎస్‌ఆర్‌ జయంతి) సందర్భంగా అభివృద్ధి పనులు ప్రారంభిచేందుకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ పులివెందులకు వచ్చారు. కార్య క్రమంలో ఎంపీ మాట్లాడుతూ వైఎస్‌ చేపట్టిన పథ కాలే ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకునేలా చేశాయన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చే సేందుకు ముఖ్యమంత్రి జగన్‌ కంకణ బద్దులయ్యార న్నారు.

సీబీఆర్‌, పైడిపాళెం ప్రాజెక్టులను నీటితోనిం పేందుకు రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు చేపట్టారన్నారు. యూసీఐఎల్‌ ప్రభావిత గ్రామాలకు భూగర్భజలాలు వాడకుండానే కృష్ణాజలాలు అందిం చేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. చక్రాయపేట మండలానికి జీఎన్‌ఎస్‌ఎస్‌, హెచ్‌ఎన్‌ ఎస్‌ఎస్‌ ద్వారా సాగు, తాగునీటిని అందించే పనులు ప్రారంభించా మన్నారు. పులివెం దులలో దాదాపు రూ.2వేల కోట్ల తో అభివృద్ధి పనులు ప్రారంభిం చామన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడు తూ మైలవరం ప్రాజెక్టులో ఏనా డూ 3టీఎంసీల నీరు కూడా వ చ్చేదికాదన్నారు. ప్రస్తుతం నియో జకవర్గంలో 35 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.  కృష్ణాజలాలు తెచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషిచేశారన్నా రు. మోడల్‌ టౌన్‌ అధికారి విజయ్‌కుమార్‌ మాట్లా డుతూ పులివెందులను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేం దుకు ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టారన్నారు.

యార్డు చైర్మన్‌ చిన్నప్ప, మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధు సూదన్‌రెడ్డి ప్రసంగించారు.  జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలం సురేష్‌, ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాష, పంచాయతీ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడి కోట శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:59:16+05:30 IST