ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం సినీ హీరో సందడి

ABN , First Publish Date - 2021-08-10T05:30:00+05:30 IST

ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం సినిమా హీరో కిరణ్‌ మంగళవారం ప్రొద్దుటూరులో అభిమానులతో కలిసి సందడి చేశారు.

ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం సినీ హీరో సందడి
కేక్‌ కట్‌ చేస్తున్న సినీ హీరో కిరణ్‌ అబ్బవరం

ప్రొద్దుటూరు టౌన్‌ ఆగస్టు 10: ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం సినిమా హీరో కిరణ్‌ మంగళవారం ప్రొద్దుటూరులో అభిమానులతో కలిసి సందడి చేశారు.  సినిమా ప్రదర్శింపబడుతున్న ఆరవేటి థియేటర్‌లో సినిమా హీరో కిరణ్‌ అబ్బవరం కేక్‌ కట్‌ చేసి చిత్ర బృందానికి అందజేశారు. అనంతరం ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని తిలకించారు. సినిమాపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో మంచి సినిమాల్లో నటిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌, సినీ ఫైనాన్షియల్‌ శోభా, వెంకటనారాయణ, నరసింహారెడ్డి, థియేటర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-10T05:30:00+05:30 IST